జనసేన పార్టీ జెండా మరియు సిద్ధాంతాలు

పార్టీ చిహ్నం మరియు జెండా

ఈ పార్టీ చిహ్నం మన దేశం యొక్క చరిత్రను మరియు పోరాటాలను నిర్వచించే ఒక దళముల కలయిక.

తెల్ల రంగు

దీనిలోని తెలుపు నేపథ్యం భారత నాగరికత మరియు సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి మరియు స్థిరత్వమును సూచిస్తుంది.

ఎరుపు రంగు

విప్లవ చిహ్నం. లోతైన మరియు నిజమైన మార్పును సూచిస్తుంది.

ఆరు మూలల నక్షత్రం

పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం. నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గం చూపించే స్వయంప్రకాశిత గుణాన్ని సూచిస్తుంది.

కేంద్ర బిందువు

మధ్యలో ఉన్న బిందువు ప్రతి జీవిలోనున్న ఆత్మ. ఇదే అఖండ సత్యం. వ్యక్తులుగా, దేశంగా మనం చేసే ప్రతి పనినీ మూర్తీభవిస్తుంది.

నల్లని చారలు

విప్లవ వాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమతూకంగా వ్యవహరించి పక్షపాతధోరణిని అసమ్మతిని దూరం చేస్తుంది

జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఇవే..

 1. కులాలను కలిపే ఆలోచనా విధానం
 2. మతాల ప్రస్తావన లేని రాజకీయం
 3. భాషలను గౌరవించే సంప్రదాయం
 4. సంస్కృతులను కాపాడే సమాజం
 5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
 6. అవినీతిపై రాజీలేని పోరాటం
 7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం

మేనిఫెస్టోలో మచ్చుతునకలంటూ హామీలు:

 1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు
 2. గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు
 3. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ
 4. బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు
 5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
 6. కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన
 7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
 8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్‌
 9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు
 10. ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు
 11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు
 12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

కాగా, తాము మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలకు కట్టుబడి ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

 

Share with friends

Leave a Reply

Your email address will not be published.